రాజకీయం అంటే ఎమిటి..?

మా వాడు ఒకడన్నాడు.. “స్టూడెంట్స్ కి పాలిటిక్స్ ఎందుకురా..? మన చదువులేవో మనం చదువుకుంటే చాలదా? ఐనా పాలిటిక్స్ లో మనం ఏమన్నా చేద్దామన్నా చెయ్యనివ్వరు..!” ఈ వాదన సమంజసమేనా..?

కాదు అనే చెప్తాను..! ఇక్కడ ముందు అర్ధం చేస్కోవాల్సింది ఏంటంటే.. అసలు పాలిటిక్స్ అంటే ఏమిటి? దురదృష్టవశాత్తూ “పాలిటిక్స్ చేయడం” అనగానే నెగటివ్ సెన్స్ వస్తుంది, కానీ లెట్స్ టేక్ ద పాసిటివ్ మీనింగ్…

పాలిటిక్స్ అంటే “పబ్లిక్ అఫైర్స్ లో ఏక్టివ్ పార్ట్ తీస్కొవడం”.. “సమాజ ప్రయోజనాల కోసం క్రియాశీలకంగా వ్యవహరించడాన్నే రాజకీయం” అని నేనంటాను.. ఏదో ఎలక్షన్లలో నిలబడి అసెంబ్లీకి పోయిరావడమే రాజకీయం కాదు. నీ వీధి మొగలో ఉన్న పనిచేయని స్ట్రీట్ లైట్ ని కంప్లైంట్ ఇచ్చి బాగుచేయించుకున్నా అది రాజకీయమే!

ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలంటే.. మా ఇంటి దగ్గర రోడ్డు వేస్తామని 2003లో కాంగ్రెస్ గవర్నమెంటు గెలిచినపుడు శంకుస్థాపన చేసెళ్ళారు. ఏడేళ్ళు గడుస్తున్నా ఏ మార్పూ లేదు. ఆ శంకుస్థాపన రాయి కూదా శిథిలావస్థకి చేరుకుంది. ఆ రోడ్డు ఎందుకు వేయట్లేదు? ఒకవేళ దానికి నిధులు కేటాయించి ఉంటే అవి ఏమైనాయి? అని ఆ మున్సిపల్ కమీషనర్ ని ప్రశ్నించి.. అవసరమైతే నిలదీసి.. మనకి రావాల్సిన రోడ్డుని మనం సాధించుకోవడం కూడా రాజకీయమే..! అయితే.. ఇది చాలా చిన్న విషయం. రాజకీయం పరిధి చాలా ఎక్కువ. దేశాన్ని నడిపించేదీ, దేశభవిష్యత్తుని నిర్ణయించేదీ రాజకీయమే. అలాంటి రాజకీయంలో యువతరం పాత్ర ఎంతైనా ఉంది.

మరి అలాంటి యువతరం, అదే మన “యూత్”, ఏం చేస్తోంది?- సినిమాలు చూస్తోంది! నిజం చెప్పాలంటే అదే చేస్తోంది.మన యువతకి మన దేశం మీదే అనాసక్తి, అయిష్టత, మరికొందరికైతే ఏకంగా ద్వేషంగా కూడా ఉంది. ఎందుకు.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? మా ఫ్రెండు ఈ విధంగా మాట్లాడాడు అని నాకు కొత్తగా కలిగిన బాధ ఏమీ లేదు ఎందుకంటే ప్రాధమిక విద్య స్థాయి నుంచీ పిల్లవాడు వృత్తివిద్య పూర్తి చేసేదాకా రెసిడెన్షియల్ పద్దతిలో హాస్టళ్ళలో నాలుగ్గోడలమధ్య పెంచుతున్నారు. ఇక వాడికి సమాజం పట్ల, రాజకీయం పట్ల కనీస అవగాహన సైతం ఎక్కడినుంచి వస్తుందీ? ఎవరు నేర్పిస్తారు? చూస్తూనే ఉన్నాం కదా.

సమాజం పట్ల, సమాజంలోని సమస్యల పట్ల అవగాహనారాహిత్యంవల్ల వ్యక్తి సమాచార సామ్రాజ్యవాదానికి సులభంగా లోబడతాడు. అసలు సమస్యలని పక్కనపెట్టి పనికిమాలిన విషయాల కోసం ఆవేశపడుతూ ఊగిపోతూ ఉంటాడు. నిజమైన సమస్యలేంటో గుర్తించలేనివాడు మార్పుకోరని వర్గంలో మిగిలిపోతాడు. ప్రస్థుత రాజకీయాలను సమర్ధిస్తూనో లేక రాజకీయలని avoid చేస్తూనో మార్పుకి ప్రతిబంధకంగా నిలుస్తాడు. ఖర్మ కొద్దీ ఇది చాలామంది తెలియకుండానే చేస్తూ ఉంటారు.

యువత మార్పుయొక్క ఆవశ్యకతని గుర్తించాలి.. తల్లిదండ్రులూ, గురువులూ, మేధావులు, వారిని ఆ వైపుకి ప్రోత్సహించాలి. ఎందుకంటే ” ప్రజల కష్టాల్నీ, కన్నీళ్ళనీ చూసి ఉద్రేకంతో, ఉత్సాహంతో సేవకోసమై, మార్పుకోసమై యువతరం ఉరకలేసిననాడు దేశం ప్రగతిమార్గంలో పరుగులెత్తుతుంది.”

7 Comments

  1. chaitanya said,

    May 26, 2010 at 1:52 pm

    nijame… youth politics lo undalani naku telsi andaru korukuntaru(esp peddavallu).. kani valla pillalni matram vellanivaru.. ippati political leaders andaru kalisi politics oka chetta danki manaki sambandham ledu ani common people anukune environment kavalane create chestunaru.idi roju roju ki ala perugutune untadi…..

  2. May 26, 2010 at 2:06 pm

    చైతన్య గారికి… ఔను, చేనేత కార్మికుల ఆత్మహత్యలకంతే యే టెన్నిస్ స్టార్ ఎవరిని పెళ్ళి చేస్కుంటుందనేది పేద్ద సమస్యలా చూపిస్తుంది మీడియా.. ప్రజల ద్రుష్టిని సమస్యల నుంచి తప్పించి తమ దారికి అడ్డురాకుండా పక్కదారి పట్టించడాన్నే సమాచార సామ్రాజ్యవాదం అంటారు..

  3. May 26, 2010 at 4:14 pm

    రాజకీయం, యూత్ పై నీ అభిప్రాయాలు బాగున్నాయి. యూత్ గా ఉండి..నువ్వు ఏ యూత్ గురించి మాట్లాడుతున్నావో అలాంటి యూత్ లా కాకుండా…చాలా ప్రోగ్రెసివ్ గా నీ ఆలోచనలు ఉన్నాయి.మన దేశంలో సమస్య ఒక చోట ఉంటే..దాని మూలం ఎక్కడో ఉంటుంది. రాజకీయాలపై యూత్ కి ఇలాంటి అభిప్రాయాలు ఉండటానికి కేవలం వాళ్లను మాత్రమే నిందించలేం. ఎందుకంటే వాళ్ల ఆలోచనలు, మానసిక ఎదుగుదలని వాళ్ల చుట్టూ ఉంటే సమాజం ఎప్పుడో కబ్జా చేసేసింది.తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలను ర్యాంకుల వేటకు పంపించారో అప్పుడే వాళ్ల పిల్లలు మిగతా ప్రపంచాన్ని మర్చి పోయారు. రెసిడెన్షియల్ పద్దతిలో హాస్టళ్లలో నాలుగు గోడల మధ్య ఉన్న వాళ్లే కాదు మిగతా వాళ్ల పరిస్థితి కూడా అందుకు పెద్ద భిన్నంగా ఏమీ లేదని నేననుకుంటాను.

    • May 26, 2010 at 10:08 pm

      ఫణి అన్నకి..

      నిజమే.. పిల్లవాడు వాడు చూసి, విని, చదివి పెరిగే సమాజంలో లేని ఏ విషయాన్నీ తనంతట తానుగా నేర్చుకోలేడు. హాస్టళ్ళలో పెరిగే పిల్లలకీ బయట ఉండే పిల్లలకీ నిజంగానే పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు.. శారీరికంగా నాలుగు గోడలమధ్య ఉండకపొయినప్పటికీ వాళ్ళ ఆలోచనలు మాత్రం అవే నాలుగు గోడలమధ్య ఇరుక్కుపొయాయి.. ఇరికించబడ్డాయి..!

  4. Siva said,

    May 26, 2010 at 7:23 pm

    Good one! Politics has become a total aversion for us these days. Every one talks about social service, but excluding the politics, which is at the core of the current pathetic situation. We fail to understand this connection

    Thanks for trying to bring some awareness. Let’s do our best to bring this realization to at least few souls

    http://prasadgummadi.blogspot.com/2008/05/blog-post.html

    • May 26, 2010 at 11:03 pm

      మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థాంక్స్.. నా ఆలోచనలతో ఏకీభవించేవారు దొరికినందుకు సంతోషంగా ఉంది.. మీ ” సమాజసేవ ఎంతవరకు సమంజసం” టపా చదివాను. సరైన ఆలోచన. పునాదిలో మార్పు రాకుండా, సమస్యయొక్క మూలంలో మార్పు రాకుండా, పైపై సేవలతో సమస్యకి కొంతమేర సాంత్వన చేకూర్చవచ్చునేమోగాని పరిష్కరించడం అసాధ్యం. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలన్నిటికీ మూలం రాజకీయంలోనే ఉందని నా వాదన. దానిపై దృష్టి పెట్టడం అవసరం. ఎందుకంటే మనం ఇవ్వాళ ఎంతో ఉదారంగా సమాజసేవ చేస్తాం, మరి రేపు మన తరవాత చేసేదెవరూ?
      అదే ఆ శక్తియుక్తులన్నిటినీ మూలాన్ని ప్రక్షాళణ చేయడంలో వెచ్చిస్తే కనీసం తరవాతి తరాలైనా సమస్యలు లేకుండా జీవించగలవని నా నమ్మకం.!

  5. geetha(buiibuii) said,

    May 26, 2010 at 9:32 pm

    meru chapina anitimeda naku antha avgahana lakapovachugani, talusukodaniki BAGUNDHI…. first of all a appriciate 4 ur steps taken….
    ALL THE BEST……KEEP GOINGGG,,,,,,,,,,


Leave a comment