రాజకీయం అంటే ఎమిటి..?

మా వాడు ఒకడన్నాడు.. “స్టూడెంట్స్ కి పాలిటిక్స్ ఎందుకురా..? మన చదువులేవో మనం చదువుకుంటే చాలదా? ఐనా పాలిటిక్స్ లో మనం ఏమన్నా చేద్దామన్నా చెయ్యనివ్వరు..!” ఈ వాదన సమంజసమేనా..?

కాదు అనే చెప్తాను..! ఇక్కడ ముందు అర్ధం చేస్కోవాల్సింది ఏంటంటే.. అసలు పాలిటిక్స్ అంటే ఏమిటి? దురదృష్టవశాత్తూ “పాలిటిక్స్ చేయడం” అనగానే నెగటివ్ సెన్స్ వస్తుంది, కానీ లెట్స్ టేక్ ద పాసిటివ్ మీనింగ్…

పాలిటిక్స్ అంటే “పబ్లిక్ అఫైర్స్ లో ఏక్టివ్ పార్ట్ తీస్కొవడం”.. “సమాజ ప్రయోజనాల కోసం క్రియాశీలకంగా వ్యవహరించడాన్నే రాజకీయం” అని నేనంటాను.. ఏదో ఎలక్షన్లలో నిలబడి అసెంబ్లీకి పోయిరావడమే రాజకీయం కాదు. నీ వీధి మొగలో ఉన్న పనిచేయని స్ట్రీట్ లైట్ ని కంప్లైంట్ ఇచ్చి బాగుచేయించుకున్నా అది రాజకీయమే!

ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలంటే.. మా ఇంటి దగ్గర రోడ్డు వేస్తామని 2003లో కాంగ్రెస్ గవర్నమెంటు గెలిచినపుడు శంకుస్థాపన చేసెళ్ళారు. ఏడేళ్ళు గడుస్తున్నా ఏ మార్పూ లేదు. ఆ శంకుస్థాపన రాయి కూదా శిథిలావస్థకి చేరుకుంది. ఆ రోడ్డు ఎందుకు వేయట్లేదు? ఒకవేళ దానికి నిధులు కేటాయించి ఉంటే అవి ఏమైనాయి? అని ఆ మున్సిపల్ కమీషనర్ ని ప్రశ్నించి.. అవసరమైతే నిలదీసి.. మనకి రావాల్సిన రోడ్డుని మనం సాధించుకోవడం కూడా రాజకీయమే..! అయితే.. ఇది చాలా చిన్న విషయం. రాజకీయం పరిధి చాలా ఎక్కువ. దేశాన్ని నడిపించేదీ, దేశభవిష్యత్తుని నిర్ణయించేదీ రాజకీయమే. అలాంటి రాజకీయంలో యువతరం పాత్ర ఎంతైనా ఉంది.

మరి అలాంటి యువతరం, అదే మన “యూత్”, ఏం చేస్తోంది?- సినిమాలు చూస్తోంది! నిజం చెప్పాలంటే అదే చేస్తోంది.మన యువతకి మన దేశం మీదే అనాసక్తి, అయిష్టత, మరికొందరికైతే ఏకంగా ద్వేషంగా కూడా ఉంది. ఎందుకు.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? మా ఫ్రెండు ఈ విధంగా మాట్లాడాడు అని నాకు కొత్తగా కలిగిన బాధ ఏమీ లేదు ఎందుకంటే ప్రాధమిక విద్య స్థాయి నుంచీ పిల్లవాడు వృత్తివిద్య పూర్తి చేసేదాకా రెసిడెన్షియల్ పద్దతిలో హాస్టళ్ళలో నాలుగ్గోడలమధ్య పెంచుతున్నారు. ఇక వాడికి సమాజం పట్ల, రాజకీయం పట్ల కనీస అవగాహన సైతం ఎక్కడినుంచి వస్తుందీ? ఎవరు నేర్పిస్తారు? చూస్తూనే ఉన్నాం కదా.

సమాజం పట్ల, సమాజంలోని సమస్యల పట్ల అవగాహనారాహిత్యంవల్ల వ్యక్తి సమాచార సామ్రాజ్యవాదానికి సులభంగా లోబడతాడు. అసలు సమస్యలని పక్కనపెట్టి పనికిమాలిన విషయాల కోసం ఆవేశపడుతూ ఊగిపోతూ ఉంటాడు. నిజమైన సమస్యలేంటో గుర్తించలేనివాడు మార్పుకోరని వర్గంలో మిగిలిపోతాడు. ప్రస్థుత రాజకీయాలను సమర్ధిస్తూనో లేక రాజకీయలని avoid చేస్తూనో మార్పుకి ప్రతిబంధకంగా నిలుస్తాడు. ఖర్మ కొద్దీ ఇది చాలామంది తెలియకుండానే చేస్తూ ఉంటారు.

యువత మార్పుయొక్క ఆవశ్యకతని గుర్తించాలి.. తల్లిదండ్రులూ, గురువులూ, మేధావులు, వారిని ఆ వైపుకి ప్రోత్సహించాలి. ఎందుకంటే ” ప్రజల కష్టాల్నీ, కన్నీళ్ళనీ చూసి ఉద్రేకంతో, ఉత్సాహంతో సేవకోసమై, మార్పుకోసమై యువతరం ఉరకలేసిననాడు దేశం ప్రగతిమార్గంలో పరుగులెత్తుతుంది.”

“happiness is directly proportional to income”…నిజమేనా?

నాకు తెలిసిన ఒకమ్మాయి అంది “Happiness is directly proportional to income!!” …

తను అన్నది ఏమిటంటే.. “అన్నిటికీ బేసిక్ డబ్బేకదా డబ్బు అవసరం రాని రోజుని ఊహించలేం కదా..! first priority డబ్బుకే ఇవ్వాలి, ఎందుకంటే మౌలిక అవసరాలన్నీ డబ్బుతోనే తీరుతాయి.. ముందు దాన్ని ” earn ” చెయ్యడమే  లక్ష్యం.. ముందు basic needs satisfy  అయ్యాకే మిగతావన్నీ … so happiness is proportional to income.. ఎంత earn చేస్తే అంత సంతోషం ”  అంటుంది.

సరే బాగానే ఉంది… కాసేపు దీన్ని ఒప్పుకుందాం.. అవసరాలు తీర్చుకోవడానికి మనిషికి డబ్బు కావాలి. మరి అలాంటి డబ్బు కోసం మనిషి ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు..? ఎక్కువ కష్టం లేకుండా సులువుగా డబ్బు వచ్చే మార్గాన్నీ, అవసరమైతే తప్పుడు మార్గాన్నీ ఎంచుకుంటాడు. అలా జరగకూడదు, ఎందుకంటే తప్పుడు మార్గంలో వెళ్తే ఈ రోజు సంతోషంగా ఉన్నా రేప్పొద్దున బాధపడాల్సివస్తుంది.. అలా జరగకూడదు అంటే దానికి మళ్ళీ ఉన్నతమైన విలువలు, మంచి వ్యక్తిత్వం, సరైన నడవడిక వంటివి   కావాలి.. వీటిని డబ్బుతో కొనలేము..!

మనిషి తప్పుడు మార్గంలో కాలుపెడితే  happyగా ఉండలేడు. అలా కాలుపెట్టకుండా ఉండాలంటే డబ్బుతో కొనలేని లేక ” earn ” చెయ్యలేని విలువలు కావాలి. There arises a contradiction.

Conclusion  ఏంటంటే.. happiness is not proportional to income ( not always ) . కొన్ని చిన్న చిన్న   సందర్భాల్లో సరేనేమోగానీ జీవితంలో తృప్తి, ఇష్టాలు, ప్రేమలు, బంధాల వంటి పెద్ద విషయాల్లో డబ్బుది పెద్ద పాత్రేమీ ఉండదు.. ఇక్కడ సంతోషం ఈ పెద్ద విషయాలమీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అవసరాలూ కోరికలూ తీరితేనే సంతోషమా?…..   ఎటొచ్చీ not always అని ఎందుకన్నానంటే ఎంత థీరీ మాట్లాడుకున్నా ప్రాక్టికల్ గా సాధ్యమా కాదా అనేది కూడా ఆలోచించాలి కదా..

సంతోషం అనేది డబ్బుమీద అస్సలు డిపెండ్ కాదా? అంటే.. అవును అవుతుంది! ప్రతి విషయాన్నీ ప్రతి వస్తువునీ ప్రతి మనిషినీ డబ్బుతో తూచే ఈ లోకంలో కటిక దారిద్ర్యం జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. సుఖసంతోషాలను దెబ్బతీస్తుంది. ఆకలి బాధిస్తుంది.. ఆత్మనూన్యత వెంటాడుతుంది.. జీవితమ్మీద ఆసక్తి లేకుండా చేస్తుంది! ఈ comment చేసిన అమ్మాయికి దారిద్ర్యం పట్ల అంత అవగాహన ఉందని నేననుకోవడం లేదు..!

ఎలాగూ డబ్బు ప్రస్తావన వచ్చింది కాబట్టి, నేను ఇదే సబ్జెక్ట్ మీద ఒక చిన్న సినిమా తీశాను.. దాని లింక్ ఇక్కడ పెడుతున్నాను.. సినిమా పేరు “ఇట్లు మీ రూపాయి”..ఒక రూపాయి తన ఆత్మకథను చెప్తుంది..తన స్వీయానుభవాలను చెప్తూ.. లోకం డబ్బుకి ఎలా దాసోహం ఔతోందో, మనిషి స్వభావం ఏంటో వివరిస్తుంది.. చూసి మీ స్పందన తెలియజేయండి..

ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబాగ్నులు ఎన్నో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..!

ఎక్కడ విన్నానో ఈ పాట.. నాకైతే గుర్తులేదు కానీ ఈ సముద్రగర్భం మాత్రం నా మనసులోని బడబాగ్నులనీ, భూకంపాల్నీ, మంచు తుఫానుల్నీ, అగ్నిపర్వతాల్నేకాక, సెలయేటి గలగలల్నీ, జలపాతపు సవ్వళ్ళనీ, వసంతఋతు పులకింతల్నీ, కోకిలమ్మ కూనిరాగాల్నీ కూడా పరిచయం చేస్తుందనుకుంటాను..!

Follow

Get every new post delivered to your Inbox.